ఇంటర్వ్యూలు

అది కాకతాళీయమే: మీనాక్షి

Published by

హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒక్కసారిగా బిజీగా మారింది. ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే… విడుదల అవుతున్న చిత్రాల లిస్ట్ కూడా పెద్దదే. రేపు (సెప్టెంబర్ 5) విజయ్ సరసన నటించిన పెద్ద చిత్రం గోట్ (“GOAT”) విడుదల అవుతోంది.

ఇక వచ్చే నెలలో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇలా వరుసగా సినిమాలు విడుదల కావడం కేవలం కాకతాళీయమే అని చెప్తోంది.

“ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసింది కాదు. 2023లో సైన్ చేసిన సినిమాలు కొన్ని ఇప్పుడు వస్తున్నాయి. అలాగే  లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాలు ఒకేసారి విడుదల కానుండడం పూర్తిగా కాకతాళీయమే. ఐతే మంచి సినిమాలలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది,” అని అంటోంది ఈ భామ.

 ఇక సినిమాలు ఎన్నుకోవడంలో గ్లామర్ రోలా, మరోటా అనేది చూడదంట. “స్క్రిప్ట్ ముఖ్యం. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను,” అని పేర్కొంది.

అలాగే రాబోయే చిత్రాలన్నిటిలోనూ వైవిధ్యమైన పాత్రలు చేసిందట.

“వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘మట్కా’ పిరియడ్ ఫిలిం. ‘మెకానిక్ రాకీ’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో తల్లిగా నటించాను. వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలోపోలీసుగా నటిస్తున్నాను. అన్నీ ప్రత్యేకమే,” అని మీనాక్షి వివరించింది.

Recent Posts

రూ.6 కోట్లు చేజారిపోతాయా?

తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More

May 23, 2025

కనకమేడల అసందర్భ ప్రకటన

చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More

May 23, 2025

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More

May 23, 2025

బన్నీకి ఈ భామలు ఫిక్స్!

అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More

May 23, 2025

వీళ్లకు అంత సీనుందా?

కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More

May 23, 2025

సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ

సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More

May 22, 2025