ఇంటర్వ్యూలు

అలా చేసినందుకు బాధపడట్లేదు: కార్తికేయ

Published by

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా “భజే వాయు వేగం” మే 31న విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడిన విశేషాలు.

భజే వాయు వేగం

ప్రశాంత్ రెడ్డి చెప్పిన “భజే వాయు వేగం” కథలోని ఎమోషన్స్ కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. లాక్ డౌన్ టైంలోనే కథ చెప్పాడు. ఐతే అప్పటికే ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేశాక ఇది చేద్దామనే ఉద్దేశంతో దీన్ని లేట్ గా పూర్తి చెయ్యాల్సి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్ కు సరైన మూవీ. నాకు  సోషల్ కన్సర్న్ ఉంది అది ఈ సినిమాలో నా పాత్ర ద్వారా కనిపిస్తుంది.  

ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. మొదటి సగభాగంలో హీరో ఎదురుకొనే ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం చూస్తారు. ఇక సెకండాఫ్ లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది. ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి తల తిప్పుకోలేరు.

పెద్ద సంస్థ ప్లానింగ్ వేరు

యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ సినిమా తీయడం ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళ ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో వాళ్ళ ప్లానింగ్, పబ్లిసిటీ బాగా కలిసి వచ్చింది.

హీరోయిన్ పాత్ర డిఫరెంట్

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాటల కోసం, గ్లామర్ కోసం ఉన్న పాత్ర కాదు. ఆమె పాత్ర కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్ లో ఆమె పాత్ర చూపించడానికి కారణం ఉంది. కథలో కీలకమైన పాయింట్ ఆమె చుట్టూ ఉంది. అందుకే అలా చేశాం.

వేలు, కాళ్ళు దూర్చను

కథ సెలక్షన్ చేసుకున్న తర్వాత నేను స్క్రిప్ట్ లో వేలు పెట్టను. స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తాను, డౌట్స్ అడుగుతాను కానీ దర్శకుడి ఆలోచనల్లో, విజన్ లో ఇంటర్ఫియర్ కాను. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ రెడ్డికే మొత్తం క్రెడిట్ దక్కుతుంది.

విలన్ పాత్రల చేసినందుకు… !

హీరోగా చేస్తున్న టైమ్ లో విలన్ గా “గ్యాంగ్ లీడర్”, “వాలిమై” చిత్రాల్లో చేశాను. అలా చేసినందుకు బాధపడడం లేదు, పశ్చాతాపం లేదు. “గ్యాంగ్ లీడర్” ద్వారా ఎక్కువ రీచ్ వచ్చింది నాకు. అజిత్ తో వలిమై సినిమాలో నటించాక తమిళనాట గుర్తింపు దక్కింది. ఆ తర్వాత విలన్ ఆఫర్స్ తెలుగులో వచ్చినా నాకు నచ్చేలా రాలేదు. తమిళంలో మాత్రం విలన్ గా ఆఫర్స్ వచ్చినా తెలుగులో హీరోగా చేస్తున్నందు వల్ల కమిట్ కాలేదు.

Recent Posts

రూ.6 కోట్లు చేజారిపోతాయా?

తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More

May 23, 2025

కనకమేడల అసందర్భ ప్రకటన

చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More

May 23, 2025

పవన్ కల్యాణ్ రిటర్న్ గిఫ్ట్!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More

May 23, 2025

బన్నీకి ఈ భామలు ఫిక్స్!

అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More

May 23, 2025

వీళ్లకు అంత సీనుందా?

కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More

May 23, 2025

సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ

సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More

May 22, 2025