ఒక్కోసారి సినిమా వాయిదాల మీద వాయిదాలు పడడం కూడా మంచిదేనేమో. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాకు అది కాస్త కలిసొచ్చినట్టుంది. వాయిదాల వల్ల సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగినట్టుంది. దీనికి తోడు మార్కెట్లో సరైన సినిమా లేకపోవడం కూడా కలిసొచ్చింది. అలా విశ్వక్ సేన్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.
విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8.2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. విశ్వక్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు.
నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు కోటి రూపాయల వసూళ్లు వచ్చాయి. వైజాగ్, సీడెడ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమాకు చాలా సెంటర్లలో, దాదాపు అన్ని షోలు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.
అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం కొంచెం గట్టిగానే ఆడాల్సి ఉంది. ఎందుకంటే, రీషూట్స్, వాయిదాల వల్ల అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఖర్చయింది. కృష్ణచైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, అంజలి కీలక పాత్ర పోషించింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More