సినిమా అనేది వ్యాపారం. కోట్లు పెట్టి సినిమా తీస్తారు, విడుదలైన మొదటి వారంలోనే రికవరీ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. అందుకే బెనిఫిట్ షోలు వేస్తారు, అదనపు ఆటలకు పర్మిషన్లు తెచ్చుకుంటారు. పనిలోపనిగా టికెట్ రేట్లు పెంచుకుంటారు.
ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలొస్తున్నాయి. అవి మిడ్-రేంజ్ మూవీస్ కాబట్టి టికెట్ రేట్లు పెంచలేరు. అయితే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. 31వ తేదీన సినీ ప్రేమికుల దినోత్సవాన్ని (Cinema Lovers Day) జరుపుతూ, పలు మల్టీప్లెక్సుల్లో కేవలం 99 రూపాయలకే సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించింది.
దాదాపు 4వేల స్క్రీన్స్ లో 99 రూపాయలకే టికెట్ రేటు పెట్టాలని నిర్ణయించారు.
మరి ఈ ఫెస్టివల్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గమ్ గమ్ గణేశ సినిమాలు భాగమౌతాయా అనేది ప్రశ్న. పీవీఆర్-ఐనాక్స్, సినీపొలిస్, ఏషియన్ లాంటి మల్టీప్లెక్స్ చెయిన్స్ లో శుక్రవారం రోజున ప్రతి షోకు 99 రూపాయలు మాత్రమే (రిక్లెయినర్స్ కాకుండా) టికెట్ రేటు పెట్టాలి. మరి వీళ్లు సినీ ప్రేమికుల్ని గౌరవిస్తారా లేక తమ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మాత్రమే తాపత్రయపడతారా అనేది చూడాలి. “భజే వాయు వేగం” ఇప్పటికే ఈ ఫెస్టివల్ రేట్స్ ని పాటిస్తాం అని ప్రకటించింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More