ఇంటర్వ్యూలు

‘డార్లింగ్’లో డ్రీమ్ రోల్ చేశా: నభా నటేష్

Published by

ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన మూవీ.. ‘డార్లింగ్’. కొత్త దర్శకుడు అశ్విన్ రామ్ తీసిన ఈ చిత్రానికి కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మాతలు. ఈ నిర్మాతలు ఇంతకుముందు “హనుమాన్” వంటి భారీ హిట్ సినిమాని నిర్మించారు. జూలై 19న విడుదల కానుంది ‘డార్లింగ్”. హీరోయిన్ నభా నటేష్ విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలు.

రెండేళ్ల గ్యాప్ తర్వాత నటించడం ఎలా ఉంది?

యాక్సిడెంట్ లో గాయపడ్డాను. నా భుజానికి పెద్ద గాయమైయింది. మళ్ళీ ఫిట్ నెస్ సాధించి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ‘డార్లింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది.

మీ పాత్ర గురించి చెప్పండి?

కథ నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకాబాగా నచ్చింది. స్ప్లిట్ పర్సనాలిటీ వున్న ఈ పాత్రని పెర్ఫార్మ్ చేయడం చాలా ఛాలెజింగా అనిపించింది. కామెడీ, లవ్ స్టొరీ ఎంటర్ టైనర్ లో ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. అశ్విన్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ డార్లింగ్. ఈ పాత్ర పోషించడానికి కష్టపడ్డాను. దర్శకుడు ఒక శిక్షకుడిని కూడా తీసుకొచ్చారు.

కథ విన్న వెంటనే సెట్స్ కి వెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అశ్విన్ అద్భుతమైన నేరేటర్.

ప్రియదర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

చాలా బావుంది. మాఇద్దరి మధ్య నడిచే కథ. నా యాక్షన్ కి ఆయన రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయ్యింది. తను చిల్ పర్శన్. తన కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా వచ్చేస్తుంది.

మీకు ఏ జోనర్ చిత్రాలు ఇష్టం?

నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనేది నా ప్రయత్నం.

మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?

‘డార్లింగ్’లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్.

కొత్తగా చేస్తున్న సినిమాలు?

‘స్వయంభు’ సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025