తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. అందరూ అంగీకరించాల్సిన వాస్తవం ఇది. ఎందుకంటే, కథలన్నీ ఎక్కువగా హీరోల చుట్టూనే తిరుగుతుంటాయి. కాబట్టి హీరోయిన్లకు నటించడం చాలా ఈజీ అనుకుంటారంతా.
కానీ కొంతమంది హీరోల సరసన నటించడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లకు చుక్కలు కనిపిస్తాయి.
ఉదాహరణకు సిద్ధు జొన్నలగడ్డనే తీసుకుంటే.. ఇతడితో నటించడానికి అనుపమ పరమేశ్వరన్ చాలా ఇబ్బంది పడింది.
‘టిల్లూ స్క్వేర్’లో సిద్ధు-అనుపమ కలిసి నటించారు. ఒక దశలో అనుపమ పెర్ఫార్మెన్స్ పై సిద్ధు అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. మళ్లీ ఎలాగోలా నచ్చజెప్పి ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వివాదం గురించి అందరికీ తెలిసిందే.
అడివి శేష్ తో కూడా వ్యవహారం ఇలానే ఉంటుందనే విషయం తాజాగా బయటపడింది. ‘డెకాయిట్’ నుంచి శృతిహాసన్ ఏకంగా బయటకొచ్చేసింది. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో అడివి పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. క్వాలిటీ కోసం తపిస్తాడు. ఈ విషయంలోనే శృతికి, అడివి శేష్ కి అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటారు.
ఇక విశ్వక్ సేన్ సంగతి తాజాగా బయటపడింది. ఈ హీరో కూడా తన సినిమాల్లో హీరోయిన్ల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. ఏమాత్రం తేడా అనిపించినా దర్శకుడి కంటే ముందు తనే రీటేక్ అని చెబుతాడంట. ఈ విషయాన్ని శ్రద్ధా శ్రీనాధ్ బయటపెట్టింది. విశ్వక్ తో కొన్ని సీన్స్ చేయడం టఫ్ అనిపించిందని వెల్లడించింది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More