ఉరుములేని పిడుగులా తన ఎంగేజ్ మెంట్ న్యూస్ మోసుకొచ్చాడు అక్కినేని అఖిల్. జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో తనకు నిశ్చితార్థం జరిగినట్టు వెల్లడించాడు. దీంతో ఎవరీ జైనాబ్ అంటూ సోషల్ మీడియాలో ఎంక్వయిరీలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికైతే ఆమెపై మీడియా దగ్గర పెద్దగా సమాచారం లేదు. ఉన్నంతలో తెలిసింది ఏంటంటే, ఆమె ఓ అబ్-స్ట్రాక్ట్ పెయింటర్. తెలుగులో చెప్పాలంటే కాల్పనిక చిత్రకారిణి అన్నమాట. ఆమె గీసే బొమ్మలు నేరుగా చూస్తే అర్థం కావు. తదేకంగా, ఎంతో ఆలోచనతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే నంట. కాకపోతే ముంబయిలో పెరిగింది. అఖిల్ కు, ఈమెకు ఎప్పుడు, ఎక్కడ పరిచయమైందనే విషయాన్ని పక్కనపెడితే.. ఉపాసన కొణెదల, రానా దగ్గుబాటి లాంటి వాళ్లు ఇప్పటికే ఆమెను ఫాలో అవుతున్నారు.
మరో క్రేజీ న్యూస్ ఏంటంటే.. అఖిల్ కంటే ఈమె వయసులో పెద్దదంట. ప్రస్తుతం ఆమె వయసు 39 ఏళ్లు అనేది కొందరి మాట. అఖిల్ కు ప్రస్తుతం 30 ఏళ్లు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More