ఫీచర్లు

ఇండస్ట్రీకి ‘రీ రిలీజు’లు శాపం!

Published by

తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని సినిమాలను జనం అస్సలు పట్టించుకోవడం లేదు. థియేటర్ల వైపు వెళ్లడం లేదు. మరోవైపు, హీరోల అభిమానులు తమ హీరోల పాత సినిమాలను వైభవంగా మళ్ళీ విడుదల చేస్తున్నారు.

గబ్బర్ సింగ్, ఖుషి, ఆది, ఖలేజా, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోక సుందరి,… ఇలా పాత సినిమాలన్నీ ఇటీవల గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యాయి. వాటికి బోలెడంత ప్రచారం, హంగామా జరిగింది. ఈ వీకెండ్ “భైరవం” సినిమా, మహేష్ బాబు పాత సినిమా “ఖలేజా” ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. మహేష్ బాబు అభిమానులు దానికి విపరీతంగా ప్రచారం కల్పించారు. సినిమాకి 4 కోట్ల పైన కలెక్షన్ పొందింది మొదటి రోజు.

“భైరవం” సినిమాకి అందులో సగం కూడా రాలేదు మొదటి రోజు. నిజానికి “భైరవం” సినిమాకి భారీగా ప్రచారం చేశారు. అయినా అటెన్సన్ అంతా “ఖలేజా” వైపు వెళ్ళింది.

“పండగల సమయాల్లో ఎలాగూ పెద్ద సినిమాలే డేట్స్ అన్నీ లాగేసుకుంటాయి. ఇలాంటి సమయాల్లో కూడా ఇలా పెద్ద హీరోల పాత సినిమాలను విడుదల చేసి మాలాంటి సినిమాలకు పోటీ ఇవ్వడం కరెక్టేనా?” అని భైరవం మేకర్స్ ప్రశ్న వేశారు.

నిజంగా ఈ పాత సినిమాల రీరిలీజులు కొత్త సినిమాలకు శాపంగా మారాయి. విచిత్రం ఏంటంటే జనం కొత్త సినిమాలను నాలుగు వారాలు ఆగి ఓటిటిలో చూస్తున్నారు… పాత సినిమాలను థియేటర్లో చూస్తున్నారు.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025