న్యూస్

శేఖర్ కమ్ముల ‘మెగా’ మూమెంట్

Published by

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. మొదటి చిత్రం “డాలర్ డ్రీమ్స్” 2000వ సంవత్సరంలో విడుదలైంది. పాతికేళ్ల కెరీర్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

టీనేజ్ నుంచి ఇప్పటివరకు చిరంజీవి తన ముందు అలాగే ఉన్నారు అంటూ శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో రాసుకున్నారు.

ఇది శేఖర్ కమ్ముల రాసిన పోస్ట్: “teenageలో ఒక్కసారి చూశాను చిరంజీవి గారిని. దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years. ‘lets celebrate’ అని మా team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని generationsని inspire చేసిన personality ఆయన. ‘chase your dreams, success మనల్ని follow అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. so, నా 25 years journey celebration అంటే ఆయన presenceలోనే చేసుకోవాలి అనిపించింది. Thank You Sir. ఈ momentsలోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు.”

ఈ 25 ఏళ్ళలో శేఖర్ కమ్ముల “ఆనంద్,” “గోదావరి,” “హ్యాపీ డేస్”, “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “లీడర్”, “అనామిక”, “ఫిదా”, “లవ్ స్టోరీ” వంటి చిత్రాలు తీశారు .

శేఖర్ కమ్ముల తాజాగా ధనుష్ హీరోగా “కుబేర” సినిమా తీస్తున్నారు. అది జూన్ 20న విడుదల కానుంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025