అవీ ఇవీ

సినిమా జరుగుతున్నంత వరకు చాలు!

Published by

బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా ప్రస్తుతం “రానా నాయుడు 2” (Rana Naidu 2)ను ప్రమోట్ చేస్తోంది. వెంకటేష్, రానా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఇది. మొదటి సీజన్ లో కూడా నటించింది సుర్వీన్ చావ్లా. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రెండో సీజన్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కున్న అనుభవాలను బయటపెట్టింది.

సుర్వీన్ చావ్లా అనేక తమిళ, హిందీ, పంజాబీ చిత్రాలలో నటించింది. ఒక తెలుగు చిత్రం చేసింది. రాజు మహారాజ్ (2009) అనే ఒకే తెలుగుసినిమాలో నటించింది కాబట్టి ఆమెకి ఇక్కడ పెద్ద ఇబ్బందులు ఎదురుకానట్లు ఉన్నాయి

ఇటీవల ఈ భామ బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న కొన్ని షాకింగ్ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది. ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న విషయాలను బయట పెట్టింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న ఒక తమిళ చిత్రనిర్మాత, దర్శకుడు తనతో ఎలా పడుకోవాలనుకున్నారో ఆమె చెప్పింది.

“ఆ దర్శకుడికి హిందీ రాదు. ఇంగ్లీష్ రాదు. మాలాంటి పరభాషా వాళ్ళతో మాట్లాడేందుకు అంటూ తన మిత్రుడిని పరిచయం చేశాడు. కానీ ఆ ఫ్రెండ్ పని ఏంటి అంటే హీరోయిన్లను ఒప్పించి ఆ డైరెక్టర్ తో కమిట్ అయ్యేలా చెయ్యడం. దర్శకుడికి నువ్వు నచ్చావామ్మా… ఓన్లీ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు మాత్రమే కమిట్ మెంట్ ఇవ్వు అమ్మా…. ఆ తర్వాత నిన్ను డిస్టర్బ్ చెయ్యమని ఆ దర్శకుడి ఫ్రెండ్ ప్రపోజల్ పెట్టాడు,” అని ఆమె ఆ డైరెక్టర్ పద్దతి ఎలా ఉండేదో తెలిపింది.

ఇలాంటివన్నీ ఫేస్ చెయ్యలేకే సౌత్ లో ఎక్కువ సినిమాలు చెయ్యలేదు అని పేర్కొంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025