‘పుష్ప-2’ థియేటర్లలోకి వచ్చింది. చివర్లో “పుష్ప 3” కి దారి కల్పిస్తూ సినిమాని ముగించారు. ఐతే, రెండో భాగంలోనే చాలా విషయాలు సరిగా చూపించలేదు. ఈ సినిమాతో సుకుమార్ చాలా ప్రశ్నల్ని అలానే ఓపెన్ గా వదిలేశాడు. మరి పార్ట్-3 తీయాలంటే ఆమాత్రం సస్పెన్స్ ఉండాలి కదా… బహుశా వాటిని అందులో చూపిస్తారేమో.
అయితే అసలైన సస్పెన్స్ ఇంకోటి ఉంది. పార్ట్-1లో జాలిరెడ్డిని తుక్కుతుక్కుగా కొడతాడు పుష్ప. తన ప్రేయసి శ్రీవల్లి జోలికి వచ్చినందుకు అతడికి ఆ శిక్ష విధిస్తాడు. తనకు జరిగిన పరాభవాన్ని గుర్తుంచుకుంటానని, ఎప్పటికైనా పగ తీర్చుకుంటానని అంటాడు జాలిరెడ్డి.
మరి ‘పుష్ప-2’లో ఆ ఎపిసోడ్ ఎక్కడ? అసలు జాలి రెడ్డి ఎక్కడ.. సీక్వెల్ లో జాలిరెడ్డి జాడ కనిపించలేదు. అతడి ఎపిసోడ్ ను పూర్తిగా పక్కనపెట్టాడు సుకుమార్. నిజానికి సీక్వెల్ వస్తుందనగానే జాలిరెడ్డి ఎపిసోడ్ కు ఓ కంక్లూజన్ వస్తుందని అంతా ఎదురుచూశారు. ఆ పాత్ర పోషించిన డాలీ ధనంజయ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు. కానీ పార్ట్-2లో జాలి రెడ్డి ప్రస్తావనే లేదు. ఇలా చెప్పుకుంటూపోతే సశేషంగా వదిలేసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.
ప్రారంభంలో చూపించిన జపాన్ ఎపిసోడ్.. క్లైమాక్స్ లో పేలిన బాంబ్, మధ్యలో మాయమైన షెకావత్.. ఇలా చాలా అంశాలపై స్పష్టత ఇవ్వకుండానే ‘పుష్ప-2’కు శుభం కార్డు వేశాడు దర్శకుడు.అన్నీ మూడో భాగంలోనే చూడాలేమో!
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More