సిద్దార్థ్ తెలంగాణ అల్లుడనే విషయం తెలిసిందే. ఎప్పుడైతే అదితి రావు మెడలో మూడు ముళ్లు వేశాడో, అప్పుడే తెలంగాణ అల్లుడు అయిపోయాడు ఈ నటుడు. ఇప్పుడీ హీరో ఓ ఇంటివాడు కూడా అయ్యాడు.
జీవితంలో తొలిసారి ఓ ఇల్లు కొన్నాడు సిద్దార్థ్. ఆ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. పాతికేళ్లకు పైగా కెరీర్ లో ఉన్న సిద్దార్థ్ ఎంతో డబ్బు సంపాదించాడట. కానీ ఇల్లు కొనాలని, ఆస్తులు కూడబెట్టాలని ఎప్పుడూ అనుకోలేదంట.
ఎప్పుడైతే అదితి రావు, అతడి జీవిత భాగస్వామి అయిందో, అప్పుడిక ఓ ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చిందే తడవుగా తన డ్రీమ్ హౌజ్ ను 2 నెలల కిందట కొనుగోలు చేశాడు సిద్ధూ.
ఇప్పుడు తనకు ఓ ఇంటి పేరు ఉందని, ఆ ఇంటి పేరుపై అందమైన ఇల్లు కుడా ఉందని గర్వంగా చెబుతున్నాడు ఈ హీరో. ఇతడు నటించిన త్రీ-బీహెచ్కే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు సిద్దార్థ్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More