రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్ చిత్రాలు. రణబీర్ కపూర్ సరసన “యానిమల్”, అల్లు అర్జున్ తో “పుష్ప” చిత్రాలు, విక్కీ కౌశల్ తో “చావా” వంటివి చేసి పెద్ద హీరోయిన్ గా స్థానాన్ని స్థిరపరచుకొంది. తాజాగా “కుబేరా”లో కనిపించింది. ఇవన్నీ రెగ్యులర్ పెద్ద హీరోయిన్లు చేసే మసాలా చిత్రాలే.
కానీ ఇప్పుడు ఆమె పెద్ద సినిమాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలవైపు వెళ్తోంది. ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “ది గాళ్ ఫ్రెండ్” చిత్రంలో నటించింది. ఇది కూడా పూర్తిగా రష్మిక చుట్టూ తిరిగే చిత్రం. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. త్వరలోనే విడుదల కానుంది.
ఆ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు “మైసా” అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఒప్పుకొంది. ఇందులో గోండ్ మహిళగా కనిపించనుంది. అంటే గిరిజన యువతి పాత్ర. ఇది పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.
ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ పెళ్లి చేసుకోనుందట రష్మిక. అందుకే, ముందే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో సిద్ధం అవుతోంది. పెళ్లి తర్వాత కూడా ఇలాంటి కెరీర్ ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More