న్యూస్

ఫ్యాన్స్ గుస్సా… ట్రబుల్లో రాజు

Published by

మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘గేమ్ ఛేంజర్’ కథనాలే. ఆ సినిమా ఫ్లాప్ అయిందని, భారీగా నష్టాలు తెచ్చిపెట్టిందంటూ దిల్ రాజు చెప్పినట్టు వరుసగా వార్తలు చూస్తున్నాం. వీటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాడు దిల్ రాజు సోదరుడు శిరీష్.

‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడు కానీ, హీరో కానీ కనీసం కాల్ చేయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, ‘గేమ్ ఛేంజర్’ దెబ్బతో ఆల్ మోస్ట్ ఇంటికెళ్లిపోయే స్థితికి చేరిపోయామని, ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో తేరుకున్నామని అన్నాడు. ‘గేమ్ ఛేంజర్’ నష్టాల్ని ‘సంక్రాంతి వస్తున్నాం’  సినిమా దాదాపు 60 శాతం భర్తీ చేసిందని అన్నాడు.

ఇలా ‘గేమ్ ఛేంజర్’ పై వరుసగా వస్తున్న నెగెటివ్ వార్తలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. దిల్ రాజు, శిరీష్ పేర్లు ప్రస్తావించకుండా ఓపెన్ లెటర్ విడుదల చేశారు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఏ నిర్మాత హీరోను బ్లేమ్ చేయలేదని, ఒక్క దిల్ రాజు మాత్రమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సినిమా హిట్టయితే తమ గొప్పదనమని, ఫ్లాప్ అయితే హీరోదే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మెగా ఫ్యాన్స్. ఇంకోసారి ‘గేమ్ ఛేంజర్’ గురించి కానీ, రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని, ఇదే చివరి హెచ్చరిక అంటూ లెటర్ విడుదల చేశారు.

ఈ లెటర్ శిరీష్ వరకు వెళ్లినట్టుంది. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు. తను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారితీసిందని, మెగాభిమానులు బాధపడినట్టు తనకు తెలిసిందని, ఒకవేళ తన మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించమంటూ లేఖ విడుదల చేశారు. 

Recent Posts

కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్

పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం నిధి… Read More

July 4, 2025

‘కూలి’లో దహాగా అమీర్‌ఖాన్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'కూలీ' సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర వంటి… Read More

July 3, 2025

శృతిహాసన్ తో అందుకే సెట్ కాలేదు

కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ తప్పుకుంది. అప్పటికే ఆమెపై గ్లింప్స్ కూడా… Read More

July 3, 2025

విశ్వంభరలో 4676 VFX షాట్స్

కొన్ని రోజులుగా 'విశ్వంభర' సినిమాపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి… Read More

July 3, 2025

కిర్రాక్ కాంబినేషన్

త్వరలోనే ఓ పెద్ద సినిమా ప్రకటన రాబోతోందంటూ ఊరిస్తూ వస్తున్నారు దిల్ రాజు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది.… Read More

July 3, 2025

నాకు అలాంటివి ఇష్టమే: సప్తమి గౌడ

"కాంతార" సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది కన్నడ భామ సప్తమి గౌడ. ఆ సినిమాలో ఆమెది డీగ్లామర్ పాత్ర.… Read More

July 1, 2025