“కాంతార” సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది కన్నడ భామ సప్తమి గౌడ. ఆ సినిమాలో ఆమెది డీగ్లామర్ పాత్ర. ఆమె ఆర్ట్ సినిమాల తరహా పాత్రలే చేస్తుందేమో అనే భావన ఉంది. ఐతే అలాంటి అభిప్రాయం పెట్టుకోవద్దు అంటోంది ఈ భామ.
సప్తమి గౌడ నటించిన మొదటి తెలుగు చిత్రం… తమ్ముడు. ఇది కూడా కమర్షియల్ చిత్రమే కానీ ఇందులో ఆమె ఫుల్ గ్లామర్ చెయ్యలేదు.
“నాకు గ్లామర్ పాత్రలు చెయ్యడం ఇష్టమే. మాస్ సినిమాల్లో నటించడం నచ్చుతుంది. పుష్పలో రశ్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని చెప్పింది ఈ భామ.
“కాంతార” సక్సెస్ తర్వాత ఆమెకి అన్నీ ఆ సినిమాలో చేసినటువంటి పాత్రలే అందరూ ఆఫర్ చేశారట. “అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాల్లో మీకు నేను కనిపించకపోవడానికి కారణమదే,” అంటోంది.
“డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా,” అని తెలిపింది ఈ భామ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More