కమెడియన్లు దర్శకులుగా మారడం కొత్తేం కాదు మనదగ్గర. ఇప్పటికే చాలామంది కమెడియన్లు దర్శకులుగా మారారు. వేణు అయితే బలగం లాంటి అద్భుతమైన సినిమా తీశాడు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ వంతు.
ఈ హాస్యనటుడు కూడా దర్శకుడిగా మారుతున్నాడు. తను దర్శకుడిగా మారబోతున్న విషయాన్ని ప్రకటిస్తూనే, నటీనటులు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. దీనిపై ఇతర నటీనటులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ లాంటి వాళ్లు ఇతడిపై జోకులేస్తున్నారు.
ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇతడికి మంచి గుర్తింపు తీసుకురాగా.. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’, ‘బ్రోచేవారెవరురా’, ‘హుషారు’ లాంటి సినిమాలు ఇతడ్ని నటుడిగా నిలబెట్టాయి.
సెలక్టివ్ గా సినిమాలు చేసే ఈ నటుడు, ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. రియల్ లైఫ్ లో సీరియస్ గా ఉంటూ, స్పష్టమైన భావజాలం కలిగిన ఈ నటుడి నుంచి దర్శకుడిగా ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. అన్నట్టు తనకు 25-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళా ఆర్టిస్టులు మాత్రమే కావాలంటూ పిలుపునిచ్చాడు రాహుల్ రామకృష్ణ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More