ఇంటర్వ్యూలు

8 వసంతాలు గొప్ప లవ్ స్టోరీ: అనంతిక

Published by

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ప్రేమకథాచిత్రం… ‘8 వసంతాలు’. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ నటించింది. ఆమె ఇంతకుముందు సూపర్ హిట్ “మ్యాడ్” చిత్రంలో నటించింది. ఈ కొత్త సినిమా గురించి ఈ భామ చెప్తున్న విశేషాలు చూద్దాం. ‘8 వసంతాలు’ ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ కథంతా మీ చుట్టూనే నడుస్తుందా?

ఈ కథలో అమ్మాయి పాత్ర కీలకం. ఐతే, ఇది పూర్తిగా లేడి ఓరియెంటెడ్ చిత్రం కాదు. ఇతర పాత్రలు కూడా కీలకం. కథలో చాలా లెటర్స్ ఉన్నాయి. యాక్షన్ తో కూడిన లవ్ స్టొరీ చేయాలన్న కోరిక తీరింది. ఇందులో కుదిరాయి. స్క్రిప్ట్ చదివి ఏడ్చేశాను. అంత ఎమోషన్ ఉంది. శుద్ధి యోగ్య అనే అమ్మాయిగా కనిపిస్తాను. ఆమె ఒక రచయిత. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది.

ఇది చాలా ప్యూర్ లవ్ స్టోరీ. ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందరూ కనెక్ట్ అవుతారు.

ఈ సినిమా కోసం ఏదైనా శిక్షణ తీసుకున్నారా?

అవును.. కళరి ఫైట్ నేర్చుకున్నాను. అలాగే Wing Chun అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ ని కూడా నేర్చుకున్నాను. దాని కోసం మూడు నెలలు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. దర్శకుడు ఫణీంద్ర గారు నాకు గురువు లాంటి వారు. ఆయన చెప్పింది చేశాను.

మీరు యాక్టర్ కావాలనేది మీ కోరికా?

నిజం చెప్పాలంటే పొలిటీషియన్ అవ్వాలని ఉంది నా కోరిక. అందుకే లా చదువుతున్నాను. అయితే అది ఇప్పుడు కాదు నాకు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజకీయనాయకురాలిగా మారుతాను.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025