‘పుష్ప-2’ టికెట్ రేట్స్ పై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. దీనికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ‘పుష్ప-2’ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
ముందుగా తెలంగాణ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్ కు ఏకంగా 1200 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇదేదో బ్లాక్ లో రేటు కాదు. ప్రభుత్వ అనుమతితో నిర్మాతలు అధికారికంగా ఫిక్స్ చేసిన రేటు. దీంతో ఈ టికెట్ రేటు బ్లాక్ లో 2500 రూపాయలైంది.
అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రీమియర్ షోకు ఏకంగా 800 రూపాయల టికెట్ ఫిక్స్ చేశారు. జీఎస్టీతో కలిపి రేటు అటుఇటుగా 900 అవుతుంది. బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ను 1600 నుంచి 2వేల రూపాయల మధ్యలో అమ్ముతున్నారు.
ఇక ‘పుష్ప-2’కు అత్యథిక టికెట్ రేటు ఎక్కడుందో తెలుసా? ముంబయిలోని బీకేసీలో ఉన్న జియో పీవీఆర్ వరల్డ్ లో టికెట్ ధర అక్షరాలా 3వేల రూపాయలుంది. ఇటు బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేటు (ప్రీమియర్స్ కాకుండా) 2500 రూపాయలు ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More