ప్రస్తుతం మనదేశంలో అధికార బీజేపీ భావజాలానికి అనుగుణంగా సినిమాల రూపకల్పన జోరుగా సాగుతోంది. తెలుగు సినిమా రంగం ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. బాలీవుడ్ దానికి మరింత ఊపుతీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని సినిమా పరిశ్రమల్లో “రైట్ వింగ్” ఐడియాలజీ (బీజేపీ అనుకూల) ప్రకారం అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ఇవి విజయాలు కూడా పొందుతున్నాయి. దాంతో, హీరోలు, దర్శక, నిర్మాతలు వీటిపైనే ఫోకస్ పెట్టారు.
ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదగడంలో ఇదే సరయిన పద్దతి అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే “కాంతార” సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. దాంతో, ఈ తరహా సినిమాలకు ఫెవరేట్ నటుడిగా మారిపోయారు.
తాజాగా అతను “కాంతార” ప్రీక్వెల్ లో నటిస్తున్నారు. అది వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఇక ఆ తర్వాత “హనుమాన్”కి సీక్వెల్ గా రూపొందే “జై హనుమాన్”లో నటిస్తారు. అది 2026లో రిలీజ్ కానుంది. ఇక 2027లో విడుదల అయ్యే కొత్త సినిమాని ప్రకటించారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తీసే సినిమా… The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj. ఆ మూవీని ఈ రోజు ప్రకటించారు.
ఇలా వరుసగా రెండు భక్తి చిత్రాలు, ఒక శివాజీ మహారాజ్ బయోపిక్ లైన్లో పెట్టి తన ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టంగా పేర్కొన్నారు రిషబ్ శెట్టి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More