తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఆ సినిమా తర్వాత మరికొన్ని పెద్ద సినిమాలొచ్చినప్పటికీ, రాజమౌళి మూవీని మాత్రం ఏవీ క్రాస్ చేయలేకపోయాయి. ఇప్పుడు ‘పుష్ప-2’ వంతు వచ్చింది. మరి ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ను క్రాస్ చేస్తుందా..?
ఏపీ-నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మొదటి రోజు 74 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో “దేవర”, “సలార్”, “కల్కి” సినిమాలు ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లో రాబోతున్న ‘పుష్ప-2’ సినిమా ఓపెనింగ్స్ లో ఏ స్థానంలో నిలుస్తుంది? ట్రేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70శాతం స్క్రీన్స్ దీనికే కేటాయించారు.
దీనికితోడు ముందు రోజు నుంచే ప్రీమియర్స్ మొదలుపెట్టారు. వాటికి అధికారికంగా 800 నుంచి వెయ్యి రూపాయలకు వరకు టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. రాత్రి గం.9.30, అర్థరాత్రి 1.30 గంట, ఉదయం 5.30 గంటలు.. షోలు నడిపించబోతున్నారు. ఇలా భారీ స్క్రీన్స్, భారీ టికెట్ రేట్లు కారణంగా.. ఏపీ-నైజాంలో ‘పుష్ప-2’ సినిమాకు భారీగా వసూళ్లు వస్తాయని, షేర్ ‘ఆర్ఆర్ఆర్’ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More