తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు నాగచైతన్య. ఆదివారం వస్తే ఈ హీరో పండగ చేసుకుంటాడట. ఇంతకీ సండే వస్తే చైతూ ఏం చేస్తాడో తెలుసా? ఐస్ క్రీమ్ తింటాడు.
ఐస్ క్రీమ్ తినడానికి కూడా ఆదివారం రావాలా? ఎప్పుడైనా తినొచ్చు కదా? దీనికి చైతూ దగ్గర సాలిడ్ సమాధానం ఉంది. రోజూ డైట్ లో ఉంటాడు చైతూ. అందుకే ఆ ఫిజిక్ అలా మెయింటైన్ అవుతోంది. రోజుకు 125 గ్రాముల చికెన్, 100 గ్రాముల రైస్.. ఇలా లెక్కలేసుకొని తింటాడు.
ఈ క్రమంలో డెయిరీ ఉత్పత్తులకు, బిర్యానీలకు పూర్తిగా దూరమయ్యాడు. అందుకే ఆదివారం మాత్రం ఒక ఐస్ క్రీమ్ తింటానని, ఆదివారం కోసం ఎదురుచూస్తుంటానని వెల్లడించాడు. ఇక బిర్యానీ విషయానికొస్తే, నెలకు 2 సార్లు బిర్యానీ తింటాడట. ఆ 2 బిర్యానీల మధ్య మినిమం 10 రోజులు గ్యాప్ ఇస్తాడట.
ఇలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతాడు నాగచైతన్య. చైతూ మాత్రమే కాదు, మహేష్, చరణ్ లాంటి చాలామంది హీరోలు డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More