‘హిట్3’ లో నాని సరసన నటించింది శ్రీనిధి శెట్టి. “కేజీఎఫ్” సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టికి ఇది తెలుగులో మొదటి చిత్రం. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి శ్రీనిధి చెప్పిన ముచ్చట్లు….
‘హిట్ 3’లో మీ పాత్ర ఏంటి?
మృదులగా కనిపిస్తాను. నాని గారు అర్జున్ సర్కార్ అనే పోలీసు గా వైలెంట్ గా కనిపిస్తారు. అర్జున్ సర్కార్ కి పూర్తిగా భిన్నమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి పాత్ర మృదుల. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. సాధారణంగా ఇలాంటి చిత్రాల్లో అమ్మాయిలకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ కథకు హీరోయిన్ పాత్రని లింక్ చేశారు. కథలో చాలా మంచి కనెక్షన్ ఉంటుంది నా పాత్రకి.
నానితో వర్క్ చేయడం ఎలా ఉంది? డబ్బింగ్ మీరే చెప్పారా?
నాని అద్భుతంగా నటిస్తారు. వ్యక్తిగా కూడా చాలా మంచి మనిషి. ఆయనతో పని చెయ్యడం బాగుంది. హీరోయిన్లు ఇబ్బంది పడకుండా చూసుకునే నటులతో పనిచేస్తే ఆ సినిమా బాగుంటుంది. నాని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అందుకే ఈ సినిమా మంచి ఎక్స్ పీరియన్స్. అవును, నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆల్రెడీ నా క్యారెక్టర్ కోసం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించారు. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాను.
కేజీఎఫ్, హిట్ 3…. అన్ని వయలెంట్ చిత్రాలే చేస్తున్నారు?
ఈ స్టోరీ అలాంటిది. జానర్ అలాంటిది. “కేజీఎఫ్”లో ఉన్న హింస వేరు, “హిట్ 3″లో ఉన్న వైలెంట్స్ వేరు. ఈ కథలో ఉన్న ఎలిమెంట్ కి ఈ హింస సమంజసమే అనిపిస్తుంది. . “ఐ డోంట్ లైక్ వైలెన్స్, బట్ వైలెన్స్ లైక్స్ మీ” (నవ్వుతూ)
‘కేజిఎఫ్ 3’ లో కూడా నటిస్తున్నారా?
KGF 3లో నేను ఉన్నానా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు ఇంకా కొంత కాలం వెయిట్ చెయ్యాలి. నేను ఇప్పుడు ఏమి చెప్పను.
మీరు ‘సీత ‘ పాత్రని రిజెక్ట్ చేశారా?
ఇది అబద్దం. నేను అలా అనలేదు. ఈ విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తీస్తున్న ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర కోసం ఆడిషన్ కి పిలిచారు. నేను ఆడిషన్ ఇచ్చాను.ఆడిషన్ పూర్తి అయ్యాక నాకు మేకర్స్ నుంచి కాల్ రాలేదు. అంతే జరిగింది. ఒక పెద్ద సినిమా ఆఫర్ ని, అదీ సీతమ్మ పాత్రని రిజెక్ట్ చేసే అంత పెద్ద యాక్టర్ ని కాదు. మేకర్స్ వారి విజన్ ప్రకారం ఒక పాత్రకు ఎవరిని తీసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. పలువురి హీరోయిన్లను పరిశీలించాక సాయి పల్లవిని ఎంపిక చేశారని మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఆమె అద్భుతంగా న్యాయం చేస్తారు ఆ పాత్రకు.
కొత్తగా ఏమైనా సినిమాలు ఒప్పుకున్నారా?
తెలుగులో ఇప్పటికే సిద్ధూ జొన్నలగడ్డ సరసన “తెలుసు కదా” సినిమా చేస్తున్నాను.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More