ఎప్పుడైతే ‘భారతీయుడు-2’ సినిమా డిజాస్టర్ అయిందో అప్పట్నుంచి దర్శకుడు శంకర్ పై కథనాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు కాపీరైట్ వివాదంతో కూడా ఈ దర్శకుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మధ్యలో ‘గేమ్ ఛేంజర్’ ఉండనే ఉంది.
ఇవి చాలవన్నట్టు అతడి మెడకి ‘భారతీయుడు-3’ కూడా బిగుసుకొని ఉంది. ఆ సినిమాను కూడా అతడు పూర్తిచేయాలి. దాదాపు జీరో బడ్జెట్ లో దాన్ని ముగించాల్సి ఉంది. అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ దర్శకత్వంలో శంకర్ చేయాల్సిన సినిమా కూడా దాదాపు ఆగిపోయింది.
ఇలా వరుసగా ఇబ్బందులు పడుతున్న శంకర్, ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే అతడు దర్శకత్వానికి గ్యాప్ ఇస్తాడట. ‘భారతీయుడు-3’ పనులు ముగిసిన వెంటనే అతడు రెండేళ్లు విరామం తీసుకుంటాడట.
ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం అది సరైన నిర్ణయం అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ కాస్త విరామం తీసుకోవడమే కరెక్ట్ అంటున్నారు నెటిజన్లు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More