ఇద్దరూ ఇద్దరే. ఒకప్పుడు అరివీర భయంకరమైన హిట్స్ ఇచ్చారు. తిరుగులేని క్రేజ్ తో కొనసాగారు. రీసెంట్ గా ఇద్దరూ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కానీ కిందామీద పడుతున్నారు. వాళ్లే రాజశేఖర్, విజయశాంతి.
సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు మూవీతో రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. అయితే ఆ వెంటనే ఆమె చకచకా సినిమాలు చేయలేదు. మంచి కథలు, పాత్రల కోసం వెయిట్ చేస్తూ అలా ఉండిపోయారు.
మళ్లీ ఇన్నాళ్లకు కల్యాణ్ రామ్ తో సినిమా చేశారు. సినిమాలో విజయశాంతి పాత్రకు మంచి పేరొచ్చింది కానీ సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో రీచ్ రావడం లేదు. సక్సెస్ తో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాతో ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయారు.
ఇక రాజశేఖర్ పరిస్థితి మరీ దారుణం. సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవ్వాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు.
కానీ చాన్నాళ్లు ఎదురుచూసి చివరికి ‘Extra Ordinary’ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రాజశేఖర్ ప్లాన్స్ మళ్లీ మొదటికొచ్చాయి. హీరోగా నటిస్తే జనం చూడడం లేదు, మంచి క్యారెక్టర్ రోల్స్ పడడం లేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More