‘తండేల్’ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన నాగచైతన్య, భార్య శోభితతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లొచ్చాడు. అలా హ్యాపీ బ్రేక్ తీసుకున్న ఈ హీరో, ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాడు చైతూ.
కెరీర్ లో నాగచైతన్యకు ఇది 24వ చిత్రం, ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ‘విరూపాక్ష’ హిట్ తర్వాత కార్తీక్ దండు, ‘తండేల్’ సక్సెస్ తర్వాత నాగచైతన్య కలిసి చేస్తున్న మూవీ కావడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం చైతూ ఓ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.
బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఓ మైథలాజికల్ థ్రిల్లర్. ఇప్పటివరకు చైతూ టచ్ చేయని జానర్.
ALSO READ: Meenakshi Chaudhary begins her new slate
ఈ సినిమాలో మొన్నటివరకు పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఆమె కూడా సెట్స్ లో జాయిన్ అవుతుంది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్… Read More
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More