“ఇన్నాళ్లూ రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాను. ఇకపై అతడ్ని ఇబ్బంది పెట్టను, అన్ని కేసులు ఉపసంహరించుకుంటాను. కనిపిస్తే కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెబుతాను” కొన్ని రోజుల కిందట లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇంది.
“ఇప్పుడు నేను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే. నాకు ఆ విల్లా అక్కర్లేదు. రాజ్ తరుణ్ ముందుకొచ్చి నాతో మాట్లాడాలి. చర్చలు జరపాలి. నేను బయటకు వెళ్లిపోతాను.” ఈరోజు లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
“రాజ్ తరుణ్ రౌడీల్ని పెట్టించి నాపై దాడి చేయిస్తున్నాడు. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతడ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తాను. ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తాను.” కొద్దిసేపటికి కిందట లావణ్య చేసిన ప్రకటన ఇది.
అసలు లావణ్య ఏం కోరుకుంటోంది.. ఆమెకు ఏం కావాలి.. రాజ్ తరుణ్ సంతోషంగా ఉంటే చాలు, అతడి జీవితం నుంచి వెళ్లిపోతానంటోంది.. మరోవైపు కోర్టుకు లాగుతానంటోంది, కేసులు పెడుతోంది.
ప్రస్తుతం తను ఉంటున్న విల్లా రాజ్ తరుణ్ దే అంటోంది, కానీ తనకు అక్కర్లేదంటోంది. అతడు ముందుకొచ్చి మాట్లాడితే విల్లా విడిచి వెళ్లిపోతానంటోంది.
ఇకపై రాజ్ తరుణ్ గురించి పబ్లిక్ గా మాట్లాడను. “చిన్నోడా నిన్ను ఇబ్బందిపెట్టను” అంటూ మాట్లాడిన లావణ్య, ఇప్పుడు అతడి కోసం ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేస్తానంటోంది.
రాజ్ తరుణ్ వద్దు, విల్లా వద్దు అన్నప్పుడు ఎందుకిదంతా..? ఆమె స్వచ్ఛందంగా బయటకెళ్లిపోవచ్చు కదా? ఆమె మీడియా ఎటెన్షన్ కోరుకుంటోందా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More