హీరోహీరోయిన్లకు చెందిన సోషల్ మీడియా ఎకౌంట్లను అంతా ఫాలో అవుతుంటారు. వాటిలో సదరు హీరోహీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తారు. రెగ్యులర్ గా యూత్ చేసే అల్లర్లు, హంగామా, జోకులు అందులో కనిపించవు.
ఇలాంటి వాటి కోసం, తమ ఫ్రెండ్స్ తో ఛిల్ అవ్వడం కోసం కొన్ని సైడ్ ఎకౌంట్లు కూడా మెయింటైన్ చేస్తుంటారు నటీనటులు. ఇండస్ట్రీలో దాదాపు అందరికీ ఇలాంటి డమ్మీ ఎకౌంట్స్ ఉన్నాయి. కాకపోతే అవి వాళ్లవనే విషయం ఆ సర్కిల్ కు తప్ప, సామాన్య జనాలకు తెలియవు. ఇది అలాంటి విషయమే.
అల్లు అర్జున్ కు అధికారిక ఎకౌంట్ కాకుండా ఓ పర్సనల్ ఎకౌంట్ కూడా ఉందని, దాన్ని బన్నీ భార్య మెయింటైన్ చేస్తుందనే వార్తలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆ ఎకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడట బన్నీ.
ఇప్పుడా ఎకౌంట్ పేరు బయటకొచ్చింది. @bunny_boy_private అనే ఎకౌంట్ బన్నీదేనంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం, ఈ ఎకౌంట్ ను సమంత, రానా లాంటి చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతుండడమే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ గా నడుస్తున్న ఈ చర్చపై బన్నీ టీమ్ స్పందించలేదు.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More