విలక్షణ పాత్రలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. సౌత్ లో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత అదే సౌత్ నటుడిపై ఆమె కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసింది. అలా సౌత్ సినిమాలకు ఆమె దూరమైంది.
తమిళ్ లో ఆమె ‘ధోని’, ‘కబాలి’ లాంటి సినిమాలు చేసింది. ఇక తెలుగులో ‘లయన్’, ‘లెజెండ్’ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఈమధ్య బిడ్డకు జన్మనిచ్చిన రాధికా ఆప్టే, మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటోంది.
తన సినిమాలో ఓ పాత్ర కోసం రాధిక ఆప్టేను సంప్రదించాడట దర్శకుడు పూరి జగన్నాధ్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రాబోతోంది. ఇప్పటికే సీనియర్ నటి టబును ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పుడు సేతుపతికి జోడీగారాధికా ఆప్టేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. పూరి, విజయ్ సేతుపతి, రాధికా ఆప్టే కాంబినేషన్ అంటే చూడ్డానికి ఆసక్తికరంగా ఉంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More