ఒకేసారి 2 పెద్ద వివాదాల్లో కూరుకుపోయాడు నటుడు షైన్ టామ్ చాకో. అతడిపై మలయాళ నటి విన్సీ, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. పనిలోపనిగా డ్రగ్స్ ఆరోపణలు కూడా చేసింది. సెట్స్ లో అతడు డ్రగ్స్ తీసుకున్నాడని, ఆ తర్వాత తనతో మిస్-బిహేవ్ చేశాడంటూ ఆమె తెలిపింది.
ఆమె ఆరోపించిన కొన్ని రోజులకే టామ్ పై దాడులు జరిగాయి. అతడున్న ఓ హోటల్ పైకి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి చేశారు. పక్కా సమాచారంతో, నటుడు దాడి కంటే కొంచెం ముందు ఆ స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు.
మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి దూకి, అట్నుంచి అటు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసు విచారణకు హాజరవ్వడం, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడం, బెయిల్ పై విడుదలవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఇలా 2 వివాదాల్లో ఇరుక్కున్న టామ్ పై తను లీగల్ యాక్షన్ తీసుకోనని స్పష్టం చేసింది నటి విన్సీ. ఈ సమస్యపై తను కోర్టుకు వెళ్లడం లేదని, అంతర్గతంగానే తేల్చుకుంటానని ఆమె తెలిపింది. మలయాళ ఫిలిం ఛాంబర్-‘అమ్మ’ కు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్పేసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More