తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు శివుడి చుట్టూ తిరుగుతోంది. మైథలాజికల్ మూవీస్ వైపు మొగ్గుచూపుతున్న మేకర్స్, ఈ క్రమంలో శివుడ్ని ఎక్కువగా హైలెట్ చేయడం విచిత్రం.
మొన్నటికిమొన్న ‘శివం భజే’ అనే సినిమా వచ్చింది. తాజాగా ‘ఓదెల-2’ వచ్చింది. ఈ రెండూ శివుని అంశ కాన్సెప్ట్ తోనే తెరకెక్కాయి. ‘శివం భజే’లో హీరో శివుని అంశను సంతరించుకుంటే.. ‘ఓదెల-2’ సినిమాలో తమన్న ఏకంగా శివశక్తిగా కనిపించి అలరించింది.
ఇవి మాత్రమే కాదు, త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ‘కన్నప్ప’, ‘అఖండ-2’లో కూడా శివుడి టచ్ ఉంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా మొత్తం శివుడిదే. ధూర్జటి రాసిన భక్తకన్నప్ప ఆధారంగా తీసిన ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించాడు.
ఇక ‘అఖండ-2’లో కూడా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఎక్కువగా పెట్టారు. ‘అఖండ’లో అఘోరాగా కనిపించారు బాలకృష్ణ. పార్ట్-2లో పూర్తిగా అదే పాత్రను హైలెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. అంటే, ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య చేతిలో త్రిశూలం కనిపిస్తుందన్నమాట.
ఈ సినిమాలే కాదు.. ‘జటాధర’, ‘హైందవ’, ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాల్లో కూడా శివ తత్వం చూపించబోతున్నారు. ఇక పాటల విషయానికొస్తే రీసెంట్ గా వచ్చిన ‘తండేల్’ సినిమాలో శివుడిపై పెట్టిన పాట హిట్టయిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ మొత్తం శివుడి చుట్టూ తిరుగుతోంది.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More