రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అత్యంత వివాదాస్పదమైన మూవీ “ఎంపురాన్-లూసిఫర్ 2”. మోహన్ లాల్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ ను కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు. కేరళలో ఈ సినిమా రాజకీయ దుమారం కూడా రేపింది.
నిర్మాత, దర్శకుడి ఆస్తులపై ఐటీ రైడ్స్ కూడా జరిగాయి. ఇలా అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని ఆఘమేఘాల మీద తొలిగించారు. అలా వివాదాస్పదమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
జియో హాట్ స్టార్ లో 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది “ఎంపురాన్-లూసిఫర్ 2”. మరి ఓటీటీలో ఒరిజినల్ వెర్షన్ పెడతారా? కట్ చేసిన వెర్షన్ పెడతారా? నిన్నట్నుంచి జరుగుతున్న ఈ చర్చకు తెరపడింది.
జియో హాట్ స్టార్ లో ఎడిటెడ్ వెర్షన్ నే స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు.
ఎందుకంటే, సిల్వర్ స్క్రీన్ తో పాటు, ఓటీటీకి కూడా ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ విషయంలో నెట్ ఫ్లిక్స్ పలు వివాదాలు ఎదుర్కొంది. కాబట్టి మరోసారి వివాదాలు చెలరేగకుండా ఉండేందుకు, అభ్యంతరకర సన్నివేశాలు లేకుండానే “ఎంపురాన్-లూసిఫర్ 2” సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచబోతోంది జియో హాట్ స్టార్.
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More
తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More