పూజా హెగ్డేను మోడ్రన్ లుక్ లో చూడ్డానికే ఎక్కువమంది ఇష్టపడతారు. ఎందుకంటే ఆమె ఫిజిక్ అలాంటిది. కాళ్లు కనిపించేలా వేసే మైక్రో డ్రెస్సులే ఆమెకు బాగుంటాయి. ఆమె కూడా ఎక్కువగా తన అందాల ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి బ్యూటీ ఇప్పుడు ఒక్కసారిగా రెట్రో స్టయిల్ లోకి మారిపోయింది.
నిండుగా చీర ధరించి పోజులిచ్చింది. ఏమాటకామాట చెప్పుకోవాలి, చీరకట్టులో కూడా పూజాహెగ్డే చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య సరసన ‘రెట్రో’ అనే సినిమా చేసింది పూజా హెగ్డే. ఆ సినిమా ప్రచారంలో భాగంగానే ఇలా ఓల్డ్ స్టయిల్ లోకి మారిపోయింది. కేవలం మోడ్రన్ గానే కాకుండా, ట్రెడిషనల్ గా కూడా కనిపించగలనని నిరూపించింది.
దాదాపు 2 సంవత్సరాల పాటు ఆమె బ్యాడ్ ఫేజ్ చూసింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత 3 సినిమాలతో బిజీ అయిపోయింది పూజా. ‘రెట్రో’ రిలీజ్ కు రెడీ అయింది. విజయ్ చివరి చిత్రంలో కూడా నటిస్తోంది.
ఈ పెద్ద సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీ కూడా ఉంది. తెలుగులో చివరిసారిగా ‘ఎఫ్-3’లో ఐటెంసాంగ్ చేసింది పూజాహెగ్డే. ‘గుంటూరు కారం’ సినిమా ఆమె చేజారింది.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More