బద్రీనాధ్ సమీపంలో తనకు గుడి కట్టారంటూ గొప్పలు చెప్పిన నటి ఊర్వశి రౌతేలాపై అక్కడి అర్చకులు మండిపడ్డారు. బామ్ని సమీపంలో ఊర్వశి ఆలయం ఉన్నమాట నిజమే అయినప్పటికీ, దానికి నటికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించిన సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశంగా బామ్ని ప్రాంతాన్ని చెప్పుకుంటారని, ఊర్వశి అందర్నీ తప్పుదోవ పట్టించేలా స్టేట్ మెంట్ ఇచ్చిందని అన్నారు అర్చకులు. ఆమెపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తనకు ఉత్తరాదిన రెండు గుళ్ళు కట్టారని, సౌత్ లో కూడా గుడి కట్టాలని చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతేలా. ఉత్తరాదిన బామ్నిలో పూజిస్తున్నట్టుగానే, సౌత్ లో కూడా తనకు పూజలు చేయాలన్నారు. ఆమె ఓవరాక్షన్ చూసి జనం నవ్వుకుంటున్నారు.
‘డాకు మహారాజ్’ సినిమాలో చిన్న పాత్ర చేసింది ఊర్వశి. అంతమాత్రానికే ఆ సినిమా మొత్తం తనదని కలరింగ్ ఇచ్చింది, బ్లాక్ బస్టర్ అంటూ ఊదరగొట్టింది. కట్ చేస్తే ‘డాకు మహారాజ్’ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. నార్త్ లో ఈ సినిమాకు సైకిల్ స్టాండ్ డబ్బులు కూడా రాలేదు.
సెల్ఫ్ డబ్బా రాణిగా పేరొందిన ఈ భామ అందంలో తనతో ఏ హీరోయిన్ పోటీ పడదని చెప్తోంది. అలాగే నా అందానికి పెద్ద హీరోలు, సీనియర్ స్టార్స్ ఫిదా అయిపోయారు అంటోంది. అలాగే బాలయ్యతో తనకి మంచి స్నేహం ఏర్పడింది అని చెప్తోంది. ఇదంతా సరే గానీ, షారుక్ ఖాన్ కన్నా దేశంలో నాకే పాపులారిటీ ఉంది, నాకు గుళ్ళు కట్టారు అంటూ ఎక్స్ట్రాలు చెయ్యడం వల్లే ఆమెకి వార్నింగ్ లు పడుతున్నాయి. ఓవర్ యాక్షన్ చెయ్యకు అని పూజారులు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు.
ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More
హీరో విశాల్, హీరోయిన్ సాయిధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 29న విశాల్-ధన్సిక పెళ్లి.… Read More
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ అన్నదమ్ముల మధ్య ఇప్పటికే మంటలు రేగి… Read More
నటీనటులు స్క్రీన్ పై పేర్లు మార్చుకోవడం కామన్. కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఎంతోమంది స్టార్స్ పేర్లు మార్చుకున్నారు.… Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.… Read More
పవన్ చేసే ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటారు. పవన్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటే ఆయనకు సినిమాలు సెట్… Read More