తెలుగులో ఎక్కువ సార్లు వాయిదా పడిన సినిమా ఏది? అనధికారిక లెక్కల ప్రకారం, ఈ రికార్డు ‘ఢమరుకం’ సినిమా పేరిట ఉంది. నాగార్జున-అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా లెక్కలేనన్ని సార్లు వాయిదా పడింది. ప్రతి రోజూ “రేపు రిలీజ్” అంటూ ప్రకటించి చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది ఈ సినిమా.
ఇప్పుడీ మూవీ రికార్డ్ ను హరిహర వీరమల్లు సినిమా తిరగరాసిందంటున్నారు కొంతమంది సినీ జనం. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఎక్కువసార్లు రిలీజ్ డేట్ ప్రకటించిన పోస్ట్ పోన్ చేసిన సినిమాగా ‘హరిహర వీరమల్లు’ నిలిచిందని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటివరకు 7 సార్లు వాయిదా పడిందంట. మొన్నటికిమొన్న మే 9 అని చెప్పి వాయిదా వేశారు. దాంతో కలిపి 7సార్లు వాయిదా అంటూ లెక్కకట్టారు కొంతమంది.
ఈ వాయిదాల పర్వం ఇక్కడితో ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో కూడా మరికొన్నిసార్లు ఈ సినిమా వాయిదాపడే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, పవన్ రాజకీయాలతో బిజీ. పైగా ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు. సో.. వాయిదాల విషయంలో ‘హరిహర వీరమల్లు’ ను కొట్టే పెద్ద సినిమా ఇంకోటి రాకపోవచ్చు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More