ఈమధ్యే బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఘనంగా స్వర్ణోత్సవ సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి వంతు. తను కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టారు.
అది 1974…నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీలో చిరంజీవి చదువుకుంటున్న రోజులు. బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మనసులో నటించాలనే కోరిక, కానీ ఎలా అనుకుంటున్న టైమ్ లో వచ్చింది అవకాశం.
అప్పటివరకు నలుగురు స్నేహితుల మధ్య నటించడమే తప్ప, స్టేజ్ ఎక్కని చిరంజీవి.. తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. స్టేజ్ పై నటించారు. ఆయన నటించిన తొలి నాటకం ‘రాజీనామా’.
అప్పట్నుంచి చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. ఈ ఏడాదితో అది 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన మెగాస్టార్, తన తొలి నాటకానికే ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చిందంటూ, ఫొటో కూడా షేర్ చేశారు.
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని… Read More
మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. ఈ నటుడికి షరతులతో కూడిన… Read More
కియరా ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. దీంతో ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ… Read More
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More