త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిజానికి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నారు. కానీ సెట్ అందుబాటులోకి రాలేదు. అందుకే మైసూర్ లో 2 వారాల షెడ్యూల్ పూర్తిచేసి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్ లోకి షిఫ్ట్ అవుతారు.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఆమె ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటల కంపోజిషన్ పూర్తిచేశాడు కూడా. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇదే. చరణ్, బుచ్చిబాబు సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More