“భారతీయుడు-2” సినిమాపై మరోసారి పుకార్లు ముసురుకున్నాయి. ఈ సినిమా చెప్పిన తేదీకి రావడం లేదనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన “భారతీయుడు-2” సినిమాను జులై 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావడం లేదని, ఆగస్ట్ 15కి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన “పుష్ప 2” వాయిదా పడిన నేపథ్యంలో తమ సినిమా కథకు అనుగుణంగా ఆ డేట్ ని విడుదల చేస్తే బాగుంటుంది అని టీం అనుకుందట. అలా వార్తలు వచ్చాయి.
ఈ ప్రచారాన్ని యూనిట్ తప్పు పట్టింది. మల్టీప్లెక్సులతో ఒప్పందం కుదిరిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతలు, అదే టైమ్ లో విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ సేనాపతిగా నటించిన ఈ సినిమా, చెప్పిన తేదీకే వస్తుందని పరోక్షంగా పుకార్లకు స్టాప్ వేశారు.
శంకర్, కమల్ కాంబినేషన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు-2. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు దాటుకొని విడుదలకు సిద్ధమైంది. అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలకు పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ, సినిమాపై బజ్ మాత్రం తగ్గలేదు.
సిద్దార్థ్, రకుల్, కాజల్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తమిళ్ లో ఇండియన్-2గా, తెలుగులో భారతీయుడు-2గా విడుదల చేస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More