ఓ నటుడు తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎలాంటి కథ ఎంచుకోవాలనే అంశంపై చాలా హోమ్ వర్క్, చర్చలు జరుపుతాడు. విజయ్ సేతుపతి కూడా అదే పని చేశాడు. తన 50వ చిత్రం కోసం కాస్త గ్యాప్ ఇచ్చి మరీ ఓ కథ సెలక్ట్ చేసుకున్నాడు.
మామూలుగానే విజయ్ సేతుపతి సినిమాలు బాగుంటాయి. అలాంటిది 50వ సినిమా అంటే అతడు మరింత కేర్ తీసుకొని ఉంటాడు. “మహారాజ” సినిమా చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. మంచి కథకు, అద్భుతమైన స్క్రీన్ ప్లే యాడ్ అవ్వడం అందరికీ బాగా నచ్చింది. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు విజయ్ సేతుపతి.
“తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి భయమేసింది. అందుకే మహారాజ సినిమా కనీసం యావరేజ్ అయినా అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే, చాలా ఏళ్ల తర్వాత నేను తెలుగులో ప్రచారం చేసిన సినిమా ఇది. టాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణ చూసి కదిలిపోయాను. అందరికీ చాలా థ్యాంక్స్.”
ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది “మహారాజ” సినిమా. డబ్బింగ్ సినిమా కావడం వల్ల సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. మంచి మౌత్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ రావడంతో సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More