ఇప్పుడిప్పుడే కేసుల నుంచి బయటపడుతున్నాడు బన్నీ. మెల్లమెల్లగా బయటకొచ్చి కొత్త సినిమా పనిలో బిజీ అవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో మరోసారి బన్నీపై కేసు పెట్టాలంటున్నారు కొంతమంది.
కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని బన్నీ మోసం చేశాడని ఆరోపిస్తోంది ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. ఈ మేరకు బన్నీపై కేసు నమోదు చేయాలంటూ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఈమధ్య ఓ విద్యా సంస్థకు ప్రచారం చేశాడు బన్నీ. దీన్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ తప్పుబడింది. సదరు విద్యా సంస్థతో పాటు బన్నీపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇవే విద్యా సంస్థలకు నటి శ్రీలల కూడా ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అట్లీతో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో రాబోతోంది ఈ మూవీ. ‘పుష్ప-2’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇదే.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More