ఖతార్ లో తనకు చాలా సురక్షితంగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని తెలిపాడు నటుుడ సైఫ్ అలీఖాన్. తనకుతాను సొంతంగా నిర్ణయం తీసుకొని ఆ ఇల్లు కొనేశాడు. భార్య కరీనాకు కూడా ఇంకా చూపించలేదు.
త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని అంటున్నాడు సైఫ్. ముంబయి నుంచి ఖతార్ కు చాలా ఈజీగా ప్రయాణం చేయొచ్చని, ఖతార్ వాతావరణం కూడా అద్భుతంగా ఉందని కొనియాడాడు. అందుకే ఉన్నఫలంగా ఖతార్ లో ఇల్లు కొనుగోలు చేశానంటున్నాడు ఈ సీనియర్ నటుడు.
ఈమధ్య సైఫ్ పై కత్తితో దాడి జరిగింది. ఈ క్రమంలో ఆయన ఇండియా నుంచి ఖతార్ కు తరలిపోతున్నాడనే ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశాడు సైఫ్. తను ముంబయిలోనే ఉంటానని, అప్పుడప్పుడు ఖతార్ వెళ్తానని, అవసరమైతే తన కుటుంబాన్ని ఖతార్ లో ఉంచుతానని క్లారిటీ ఇచ్చాడు.
‘దేవర’లో విలన్ గా నటించాడు సైఫ్. ఆ సినిమా పార్ట్-2 ఇంకా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More