అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ఇండియాలో అదరగొట్టింది. ఓవరాల్ గా భారతదేశంలో అత్యధిక వసూళ్లు పొందిన సినిమాగా రికార్డ్ పొందింది. అలాగే “దంగల్” తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు పొందిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది.
ఐతే బుల్లితెర ప్రేక్షకులు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. ఈ సినిమా నెల 13న స్టార్ మాలో ప్రసారం అయింది. టీవిలో మొదటిసారి సినిమా ప్రసారం అయింది. అయినా దీనికి వచ్చిన వ్యూయర్ షిప్ చాలా తక్కువ.
“పుష్ప 2” సినిమాకి 12.8 పాయింట్ల రేటింగ్ వచ్చింది. ఇటీవల వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” మొదటి సారి టీవీలో ప్రసారం ఐతే ఆ సినిమాకి 18 పాయింట్ల రేటింగ్ లభించింది. దీన్ని బట్టి చెప్పొచ్చు “పుష్ప 2” టీవీ ప్రేక్షకులను అంతగా ఉత్సాహపరచలేదు అని.
థియేటర్లలోనే ఎక్కువ మంది చూడడం వల్లే ఇలా జరిగింది అనుకోవడానికి లేదు. “పుష్ప 2” థియేటర్లలో రికార్డులు సృష్టించిన మాట వాస్తవమే కానీ తెలుగునాట ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించలేదు. తెలుగునాట మంచి విజయం సాధించింది. అంతే. రికార్డులు నెలకొల్పలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More