రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ని పునరుద్ధరించుకున్నారు. ఈ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆయన ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. రూల్స్ ప్రకారం ఫోటో దిగి, సంతకం చేసి లైసెన్స్ తీసుకున్నారు.
సెలెబ్రిటీల కోసం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ అధికారులు సహజంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. రాజమౌళిని కూడా అధికారులు సాదరంగా ఆహ్వానించి ఆయనకి కొత్త లైసెన్స్ కార్డు అందచేశారు.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో ఒక భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఇండియాలో మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొంది. త్వరలోనే కెన్యా సహా పలుదేశాల్లో భారీ యాక్షన్ సీన్లు తీస్తారు. అందుకే, రాజమౌళి తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకున్నారు అని అంటున్నారు.
సహజంగా రాజమౌళి యాక్షన్ సన్నివేశాలను కూడా తనే చేసి చూపిస్తారు నటులకు. సో, ఆయన రేసింగ్ వంటి యాక్షన్ సీన్లు కూడా బహుశా చేసి చూపిస్తారు కాబోలు. అందుకే, లైసెన్స్ తీసుకున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More