ఇంటర్వ్యూలు

పెళ్లి ఈ ఏడాదే జరుగుతుంది: వరలక్ష్మి

Published by

వరలక్ష్మీ శరత్ కుమార్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలోనైనా మెప్పిస్తుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం… ‘శబరి’. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ కాట్జ్ దర్శకుడు.మే 3న విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

‘శబరి’లో పాత్ర ఏంటి?

ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నాకు దక్కుతున్నాయి. ఇలాంటి టైంలో కొత్త తరహా పాత్రని క్రియేట్ చేసి తీసుకొచ్చారు అనిల్. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమానే కానీ ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఇదొక ఒక డిఫరెంట్ సినిమా. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. భర్తతో సమస్యల కారణంగా వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచే అమ్మాయి కథ ఇది. ఒక చిన్నారికి తల్లిగా నటించాను ఇందులో.

ఈ సినిమా మధ్యలో ఆగిందా?

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల జెన్యూన్ పర్సన్. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమాని పూర్తి చేశారు.

కథలో కొత్తదనం ఏంటి?

కథ కన్నా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా ‘శబరి’. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. మదర్ అండ్ డాటర్ సన్నివేశాలు హైలెట్ అవుతాయి. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది మెయిన్ పాయింట్.

ఈ టైంలో ఒక పాపకి తల్లిగా నటించడం రిస్క్ అనిపించలేదా?

నా తొలి సినిమా ‘పొడా పొడి’లో మదర్ రోల్ చేశా. ‘పందెం కోడి 2’లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను.

ఇటీవల నిశ్చితార్థం జరిగింది మరి పెళ్లి ఎప్పుడు?

ఈ ఏడాదే ఉంటుంది. ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు.

కాబోయే భర్త నికోలయ్ మీ సినిమాల గురించి కామెంట్ చేస్తారా?

బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు లెండి (నవ్వులు).

వరలక్ష్మీ శరత్ కుమార్ వీడియో ఇక్కడ చూడండి…

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025