ఇంటర్వ్యూలు

‘సరిపోదా’ స్క్రీన్ ప్లే అదిరిపోద్ధి: నాని

Published by

హీరో నాని నటించిన కొత్త చిత్రం.. సరిపోదా శనివారం. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్.జె. సూర్య విలన్ గా నటించారు. ఇంతకుముందు ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకుడు. ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా గురించి నాని చెప్పిన ముచ్చట్లు…

‘సరిపోదా శనివారం’ కథలో మీకు నచ్చిన అంశమేంటి?

ఇందులో మంచి కథ ఉంది. ఇక మెయిన్ పాయింట్ ఏంటో ట్రైలర్లో చూపించాం. ఆ పాయింట్ ని ఎంత ఉత్కంఠగా చూపించాం అనేది ఇందులో ఆసక్తిని రేపుతోంది. నాకు ఆ నేరేషన్ నచ్చింది. స్క్రీన్ ప్లే అదిరిపోద్ది. చాలా ఉద్రేకపరిచే సన్నివేశాలు ఉంటాయి. థియేటర్లో మాత్రమే ఎంజాయ్ గలిగే సన్నివేశాలు.

ఈ సినిమాలో హీరోగా నటించేందుకు అస్సలు కష్టపడలేదు. అసలు కష్టమంతా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య గారిదే. సూర్య గారు, హీరోయిన్ ప్రియాంక, మురళీశర్మ… వీరంతా కథాభారాన్ని మోశారు. అలా నా పని సులువు అయింది.

సూర్య గారితో వనటించడం ఎలా ఉంది?

చాలా ఎంజాయ్ చేశాను. అయన స్వతహాగా డైరెక్టర్ కాబట్టి ఆయనకి చాలా కథ, కథనాలు, పాత్రల స్వభావాల మీద పూర్తి పరిజ్ఞానం ఉంది. ఆయన నటన అందుకే బాగుంటుంది. ఒక కొత్త పద్దతి ఆయన నుంచి తెలుసుకోవచ్చు. దాదాపు ఏడు రోజులు కస్టపడి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆయన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు ప్రేక్షకులు. అంత బాగుంటుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంతకుముందు మీతో తీసిన “అంటే సుందరానికి ఆడలేదు కదా?

అవును. కానీ ఆ సినిమా చాలా మందికి బాగా నచ్చిన సినిమా. నిడివి విషయంలో ఎక్కువగా విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. స్క్రీన్ ప్లే పొరపాట్లు కూడా ఉన్నాయి. కానీ దర్శకుడిగా వివేక్ సూపర్. అందుకే, ఈ సినిమా విషయంలో అతని బలాన్ని గుర్తు చేస్తూ సపోర్ట్ చేశాను.

“శనివారం” అని టైటిల్లో పెట్టడానికి కారణం ఏంటి?

కథకి లింక్ ఉంది. సినిమా మొదలైన 5 నిమిషాల తర్వాత అదేంటో తెలిసిపోతుంది. చాలా ఎమోషనల్ యాంగిల్ ఉంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే బాగా కుర్దిరింది. మేము అనుకున్న ఐడియా స్క్రీన్ పై బాగా వచ్చింది.

ఇది యాక్షన్ సినిమానా?

సినిమాలో ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు అంతా కలిపి 20 శాతం ఉంటాయి. కానీ యాక్షన్ మూడ్ ఉంటుంది మిగతా భాగం అంతా.

మీరు ఈ మధ్య ప్రతి సినిమాని పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. కానీ ఫలితం గొప్పగా లేదు కదా?

సినిమా సినిమాకి స్పందన పెరుగుతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మెల్లగా మార్కెట్ పెరుగుతోంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025