తెలుగు బిగ్ బాస్ సీజన్-8పై చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని వాస్తవాలున్నాయి. ఈ క్రమంలో టీవీ ఆర్టిస్టు జ్యోతి రాయ్ పేరు కూడా తెరపైకొచ్చింది. దీనిపై ఆమె స్పందించింది. తను బిగ్ బాస్ కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది.
“నేను బిగ్ బాస్ కు వెళ్లడం లేదు. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ గాసిప్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఏదైనా నా నోటి నుంచి వస్తే నమ్మండి. మిగతావన్నీ నమ్మొద్దు. నా తల్లిదండ్రులు నా సోదరుడితో ఉంటారు. వాళ్లు ఏ మీడియాతో మాట్లాడలేదు. కన్నడ బిగ్ బాస్ నుంచి మాత్రం ఆఫర్ వచ్చింది. దానికి నేను నో చెప్పాను.”
ఇలా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది జ్యోతి రాయ్.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం యాక్టింగ్ కెరీర్ పైనే ఉందని.. బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లి తననుతాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది.
“ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. యాక్టింగ్ నా కెరీర్. ఇలాంటి టైమ్ లో హౌజ్ లోకి వెళ్లి, నలుగురితో గొడవ పడి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ లోనే ఉండాలనుకుంటున్నాను. మిగతా అంశాలపైకి నా దృష్టి పోవడం లేదు.”
ప్రస్తుతం ఈమె “మాస్టర్ పీస్” అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు త్వరలోనే మరో సినిమా కూడా లాంఛ్ కాబోతోంది. ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎక్కువే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More