ఇంటర్వ్యూలు

‘కల్కి 2’ ఎప్పుడంటే: నాగ్ అశ్విన్

Published by


నాని హీరోగా “‘ఎవడే సుబ్రహ్మణ్యం” అంటూ మూవీ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది అతనికి మొదటి చిత్రం. ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో ఈ దర్శకుడు కేవలం మూడే సినిమాలు తీశాడు. అవి… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 AD.

మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మళ్ళీ విడుదల అవుతోంది.. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు.

ఎవడే, మహానటి, కల్కి… ఈ మూడింట్లో మీ బెస్ట్ వర్క్ ఏంటి?

ముగ్గురు పిల్లల్లో ఎవరు ఇష్టమంటే ఎలా చెపుతాం? “మహానటి” సినిమా దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చింది. దానికి కారణం.. ఆ సినిమాకి చాలా టైం దొరికింది. సినిమాని మరింత మెరుగు చూసుకునే వెసులుబాటు, సమయం లభించింది. అందుకే, బాగా వచ్చింది.

కల్కి2 ని ఎప్పుడు మొదలు పెడుతున్నారు?

ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ఉండొచ్చు. ప్రభాస్ డేట్స్ అవీ చూసుకోవాలి.

ఈ పదేళ్లలో మూడు సినిమాలే తీశారు? మీ కేరీర్ పట్ల సంతోషంగా ఉన్నారా?

కల్కి సినిమాకి ఎక్కువ టైం పట్టింది. అలాంటి భారీ సినిమాని రెండేళ్లలో పూర్తి చెయ్యలేం. నటీనటుల డేట్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు… ఇలా చాలా తతంగం దర్శకుడి చేతిలో ఉండవు. కెరీర్ పరంగా చాలా తృప్తిగా ఉన్నాను. నేను చేసిన జాన్రా, కథ మరొకరు చేయలేదు. తీసిన మూడూ హిట్టే. చాలా హ్యాపీగా ఉంది.

విజయ్ దేవరకొండని మూడు సినిమాల్లో రిపీట్ చేశారు. నానిని తీసుకోలేదు ఎందుకని?

“కల్కి”లో నానిని తీసుకోవాలి అనుకున్నాం. వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి వర్కవుట్ చేస్తాం.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025