సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన ‘కృష్ణమ్మ’ మే 10న విడుదల కానుంది. ఈ సినిమా గురించి సత్యదేవ్ చెప్పిన ముచ్చట్లు
‘కృష్ణమ్మ’ గురించి చెప్పండి…
దర్శకుడు గోపాల కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో, మా నిర్మాత కృష్ణ గారు దర్శకుడు కొరటాల శివ గారికి చెప్పారు. ఆయనకి బాగా నచ్చి ఈ సినిమాకి ప్రజెంటర్ అయ్యారు. ఆ తర్వాత నేను ఈ కథ విన్నాను. నాకూ బాగా నచ్చింది. ట్రైలర్ లో చూపించిన దాని కన్నా ఈ కథ బాగుంటుంది. ముఖ్యంగా ఇది ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ. తమ కలలు కూలేలా చేసిన్పప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారు అనేదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఇది యాక్షన్ సినిమా కాదు స్నేహితుల చిత్రం. హీరో బాధ నుంచి వచ్చే రివెంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ వస్తాయి. అంతే కానీ కావాలని ఫైట్ సీన్స్ పెట్టలేదు.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
వించిపేట భద్ర అనే పాత్ర నాది. ఈ పాత్ర కోసం, విజయవాడ యాస కోసం, కొంచెం ఎక్కువ కష్టపడ్డాను. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్.
కొరటాల గారు ఏమైనా మార్పులు చెప్పారా?
లేదండి. ఆయనకి కథ మొత్తం నచ్చింది. అందుకే ఆయన ఎక్కడా కలగచేసుకోలేదు.
వైవిధ్యం కోసం ఎక్కువ కష్టపడుతున్నట్లు ఉన్నారు?
కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ట్రై చేస్తున్నా. ఇందులో ఒక చిన్న క్రిమినల్ పాత్ర, తర్వాత ఒక క్రైం కామెడీ, ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గా, ఇంకో సినిమాలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నా. ఇలా ప్రతి సినిమాకి కొంత వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నా.
హీరోగా కాకుండా విలన్ గా కూడా నటిస్తున్నారు కదా.
‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి గారు హీరో అని విలన్ గా చేశాను. ” రామసేతు”లో అక్షయ్ కుమార్ మూవీ కాబట్టి ఒక కీలక పాత్ర ఒప్పుకున్నాను. ఐతే, ఇప్పుడు అంతటి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు రావట్లేదు. వస్తే చేస్తాను.
మీ డ్రీమ్ రోల్?
కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన “నాయగన్” లాంటిది చెయ్యాలి. అలాగే చిరంజీవి గారి “ఆపద్బాంధవుడు” లాంటి సినిమా చేయాలి.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More