విజయ్ దేవరకొండ ఇటీవల వరుస అపజయాలు చూశారు. దాంతో ఈ ‘అర్జున్ రెడ్డి’ హీరో కొంత నిరాశలో మునిగారు. ఐతే తిరిగి తన కెరీర్ ని ట్రాక్ లో పెట్టాలని కసిగా ఉన్నాడని అర్థం అవుతోంది. ఆయన తదుపరి మూడు చిత్రాలు కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ తీసేవే.
ఇప్పటికే “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీస్తున్న పీరియడ్ మూవీలో నటిస్తున్నారు విజయ్. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇక దిల్ రాజు తమ సంస్థ తరఫున మరో చిత్రం ప్రకటించారు. “రాజావారు రాణిగారు” చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా గ్రామీణ నేపథ్యంగా ఒక యాక్షన్ సినిమా తీయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ చెప్పిన కథకు కూడా విజయ్ దేవరకొండ ఓకె చెప్పినట్లు టాక్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో ఇంతకుముందు “టాక్సీవాలా” వచ్చింది. అది హిట్. ఆ తర్వాత ఆ దర్శకుడు నానితో “శ్యామ సింగ రాయ్” అనే భారీ చిత్రం తీసి విజయం అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండతో మూవీ సెట్ అయింది. మొత్తంగా విజయ్ దేవరకొండ మూడు కొత్త సినిమాలు ఇవే.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More