ఇంటర్వ్యూలు

అలాంటివి చెయ్యాలనేది డ్రీం: కేతిక

Published by

ఇటీవల ఒక ఐటెం సాంగ్ లో ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు “సింగిల్” అనే సినిమాతో మన ముందుకు రానుంది హీరోయిన్ కేతిక శర్మ. ఈ సినిమా విశేషాలు మనతో పంచుకున్నారు కేతిక.

సింగిల్ గురించి చెప్పండి?

‘సింగిల్’ మే 9న రిలీజ్ అవుతోంది. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఈ వేసవిలో ఎండల బాధను మరిచిపోయేలా నవ్వులు పంచే సినిమా ఇది. ఇది ఫుల్ ఫన్ తో కూడిన చిత్రం. నేను పూర్వ అనే పాత్ర పోషించాను. ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ ఈజీగా కనెక్ట్ అవుతుంది. హీరో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికక్కడే డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసేస్తుంటారు. ఆయనతో వర్క్ చేయడం బాగుంది. ఇక ఈ సినిమాలో ఇవానాది కూడా మంచి పాత్ర. మా మధ్య ఒకటి రెండు సీన్స్ ఉన్నాయి.

మీరు రాబిన్ వుడ్ లో డ్యాన్స్ చేసిన పాట బాగా వివాదాస్పదమైంది కదా!

అవును.. “అదిదా సర్ప్రైజ్” పాట బాగా వైరల్ కావడం సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆ పాట అంత వివాదం అవుతుంది అనుకోలేదు. ఇకపై డ్యాన్స్ స్టెప్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాను. ఆ వివాదం గుణపాఠం నేర్పింది.

కెరీర్ పట్ల ఆనందంగా ఉన్నారా?

హిట్, ఫ్లాపులు మన చేతిలో ఉండవు. కానీ నాకు పెద్ద బ్యానర్లలో సినిమాలు వస్తున్నాయి. మైత్రి, గీతా ఆర్ట్స్… ఇలా పెద్ద నిర్మాణ సంస్థలు నాకు ఆఫర్లు ఇస్తున్నాయి. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తిగా కష్టపడుతాను. నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను. ఇప్పటివరకు చేసిన సినిమాలు, కెరీర్ సంతృప్తిని ఇచ్చాయి.

డ్రీమ్ రోల్ ఏంటి?

రష్మిక మందన నటిస్తున్న “గర్ల్ ఫ్రెండ్”లాంటి మూవీ చేయాలని ఉంది. అందులో రష్మిక గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పాత్రలు చెయ్యాలనేది నా కల. సాయి పల్లవి, కీర్తి సురేష్ చేసే పాత్రలు కూడా ఇష్టం.

కొత్త సినిమాలు ఏంటి?

హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ – తెలుగు ద్విభాషా చిత్రం ఒకటి లైన్లో ఉంది.

Recent Posts

యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!

రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More

July 5, 2025

కీర్తికి పెళ్లయిందని చాలా బాధపడ్డా!

కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More

July 5, 2025

అనుదీప్ ను నెట్టేసిన పోలీసులు

అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More

July 5, 2025

ప్రభాస్ ఇప్పటికీ బాధపెడుతున్నాడు!

ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More

July 4, 2025

చిరు కామెడీ నెక్ట్స్ లెవెల్

తన సినిమాలో చిరంజీవి పాత్రపై స్పందించాడు అనీల్ రావిపూడి. కామెడీ టైమింగ్ లో చిరంజీవి నెక్ట్స్ లెవెల్ అని తెలిపిన… Read More

July 4, 2025

కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్

పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం నిధి… Read More

July 4, 2025