ఇంటర్వ్యూలు

ఫరియా: ‘ఆ ఒక్కటీ అడక్కు’ కామెడీతో కిక్కు

Published by

ఫరియా అబ్దుల్లా మంచి అందెగత్తె. పక్కా హైదరాబాదీ భామ. ఈ అందాల చిట్టి కామెడీలో కూడా దిట్ట. “జాతి రత్నాలు” సినిమాలో ఆమె కామిక్ టైమింగ్ అదిరింది. ఇక అప్పుడు అల్లరి నరేష్ తో కలిసి అల్లరి అల్లరి చెయ్యబోతోంది. నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మే 3న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఫరియా అబ్దుల్లా విలేకరులతో ముచ్చటించింది.

‘ఆ ఒక్కటీ అడక్కు’ లో మీ పాత్ర ఏంటి?

సిద్ధి అనే అమ్మాయిగా నటించాను. సినిమాలో హీరో అన్ని ప్లాన్ చేసుకొని బతికే టైప్. నా పాత్ర స్వేఛ్చగా జీవించే పిల్ల. ఇద్దరూ భిన్న ధ్రువాలు. అలాంటి వాళ్ళు పెళ్లి అనే దానితో లింక్ అవుతారు. కొత్త దర్శకుడు మల్లి అంకం కథ, కాన్సెప్ట్ ని బాగా డిజైన్ చేశారు.

అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ కి పెట్టింది పేరు. ఆయనతో నటించడం కష్టంగా అనిపించిందా?

నరేష్ గారితో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్. ఆయన కామెడీ టైమింగ్ ఎక్స్ ట్రార్డినరీ. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. నేను ఆయనకి కామెడీలో మ్యాచ్ అయ్యేలా ప్రయత్నించాను.

‘జాతిరత్నాలు’లో లాగే ఉంటుందా కామెడీ?

లేదు. ఇందులో కామెడీ డిఫరెంట్. సన్నివేశాల నుంచి పుట్టే హాస్యం. ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.

ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?

ఒక మాస్ మసాలా పాత్ర చెయ్యాలని ఉంది. అలాంటి సినిమాలు, పాత్రలు ఇప్పటివరకు చెయ్యలేదు. హారర్ థ్రిల్లర్ చేయాలని కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. నా హైట్ కి, నా పర్సనాలిటీకి అవి బాగుంటాయి అనుకుంటున్నాను.

“జాతిరత్నాలు 2” ఎప్పుడు మొదలవుతుంది?

ప్రస్తుతం నిర్మాతలు ‘కల్కి 9898AD”తో బిజీగా వున్నారు. ” కల్కి” విడుదల తర్వాత “జాతిరత్నాలు 2” ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను.

కొత్త చిత్రాలు ?

‘మత్తువదలరా 2’ చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో “భగవంతుడు” అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని మలయాళ కథలు కూడా వింటున్నాను.

Recent Posts

షుగర్ బేబీ త్రిష అందాలు

అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More

May 21, 2025

చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!

త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More

May 21, 2025

రఘుబాబు పాట ప్రయాస!

నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More

May 21, 2025

కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్

"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More

May 21, 2025

ఆర్తికి నెలకు 40 లక్షలు కావాలంట

తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు… Read More

May 21, 2025

అటెన్షన్ అంతా కియరాదే

ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా "వార్ 2" టీజర్ రాబోతుంది అని ఆ… Read More

May 20, 2025